
రోహిత్ శర్మ (Rohit sharma)టెస్ట్ క్రికెట్(Cricket) నుంచి రిటైర్మెంట్(Retirement) ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టెస్ట్ ఫార్మాట్(Test Format) నుంచి రిటైర్ అవుతున్నట్లు రోహిత్ శర్మ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అయితే, తాను వన్డే క్రికెట్ ఆడటం కొనసాగిస్తానని, సుదీర్ఘ ఫార్మాట్లో ఆడనంటూ రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్ శర్మ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, దీని వెనుక ఉన్న ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
రోహిత్ శర్మ తన టెస్ట్ క్యాప్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..’ అందరికీ నమస్కారం, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు మీకు చెప్పాలనుకుంటున్నాను. తెల్లటి దుస్తులలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. సంవత్సరాలుగా మీరు నాకు అందించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. నేను వన్డే ఫార్మాట్లో ఆడటం మాత్రం కొనసాగిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
రిటైర్మెంట్తో గుడ్‌న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ.. అసలు కారణం వన్డే ప్రపంచ కప్?
టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ అతని అభిమానులను చాలా బాధతోపాటు, నిరాశకు గురి చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, మంచి విషయం ఏమిటంటే రోహిత్ తన అభిమానులకు ఒక గొప్ప వార్తను కూడా అందించాడు. వన్డే క్రికెట్ ఆడటం కొనసాగిస్తానంటూ శుభవార్త చెప్పాడు. రోహిత్ శర్మ 2027 ప్రపంచ కప్ వరకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అతని కెప్టెన్సీలో, టీం ఇండియా 2023 ప్రపంచ కప్‌లో ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కానీ, రోహిత్ ఇంకా ఆ ఆశను మాత్రం వదులుకోలేదు. రోహిత్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి అసలు కారణం, వన్డే ప్రపంచకప్ ఆడడమేనని తెలుస్తోంది. టెస్ట్ ఫార్మాట్లో ఆడడం అంటే, ఫిట్నెస్ విషయంలోనూ రోహిత్‌కు సవాలుతో కూడుకున్నది. అందుకే, నిర్ణీత ఫార్మాట్లో ఆడేందుకు నిర్ణయించుకున్నాడు.









