ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోయింది. ఒకప్పటిలా పెళ్లైన తర్వాత హీరోయిన్లను అక్కలుగా, వదినలుగా చూపించే రోజులు పోయాయి. ఇప్పుడు మాత్రం పెళ్లైన తారలకే ఎక్కువ క్రేజ్.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇదే ధోరణి కనిపిస్తోంది. నయనతార, కాజల్, సమంత, అలియా భట్, కత్రినా కైఫ్, దీపిక, కియారా అద్వానీ, రకుల్ లాంటి హీరోయిన్లు పెళ్లైన తర్వాత మరింత ఫేమ్ సంపాదించుకున్నారు. నయనతార ఒక్కటే చూసినా, పెళ్లి తర్వాత ఆమె క్రేజ్ మినహాయింపు లేకుండా పెరిగింది.
సినిమాకు రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటోంది – ఏకంగా 10 కోట్లకు పైగా. చిరంజీవి, అనిల్ రవిపూడి సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్తోంది. కాజల్ అగర్వాల్ కూడా పెళ్లైన తర్వాత వరుస అవకాశాలతో బిజీగా ఉంది.
విడాకుల తర్వాత సమంత తిరిగి ఫాంలోకి వచ్చి, చురుకుగా మూవీల్లో నటిస్తోంది. కియారా అద్వానీ “వార్ 2” టీజర్లో కేవలం మూడు సెకన్లలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బాలీవుడ్లోనూ అలియా, దీపిక, కత్రినా లాంటి మ్యారెడ్ హీరోయిన్లదే ఆధిపత్యం. ఇప్పుడు మేకర్లు ఎక్కువగా పెళ్లైన తారలకే అవకాశాలు ఇస్తున్నారు. గ్లామర్లోనూ, స్క్రీన్ ప్రెజెన్స్లోనూ వీళ్లే ముందున్నారు.
దీంతో కొత్తగా వచ్చిన యువ హీరోయిన్లు వాళ్ల ధాటికి పోటీ ఇవ్వలేక పోతున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు శ్రీమతలే రూల్ చేస్తున్నారని చెప్పొచ్చు.