నాగర్ కర్నూల్(Nagar Kurnool) జిల్లా అచ్చంపేటలోని(Achampet) ఎస్సీ బాలికల హాస్టల్(SC girls Hostel) ఆవరణలో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థిని, హాస్టల్ భవనంపై నుంచి ఒక్కసారిగా ఊడిపడిన ఇనుప పైపుకు తలమీద బలమైన గాయం పాలైంది. ఈ ప్రమాదం అనంతరం వెంటనే నందిని స్థానిక దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించేందుకు ప్రయత్నించారు.










