బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘జవాన్’తో(Jawan) రూ. 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ సౌతిండియన్ డైరెక్టర్ అట్లీ(Atlee). ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), సల్మాన్ ఖాన్(Salma) తో ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నని(Rashmika mandanna) పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్ట్ గురించి అట్లీ గతంలో ప్రస్తావిస్తూ.. ‘ఈ సినిమా భారత దేశానికే గర్వకారణం’ అని బహిరంగంగా తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అట్లీ తర్వాతి ప్రాజెక్ట్ అల్లు అర్జున్తో(Allu Arjun) చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుంది. ఇందులో బన్నీ ఓ కొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్(Trivikram) కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా మైథలాజికల్ జోనర్ అన్న ప్రచారం అనౌన్స్‌మెంట్ నుంచి జరుగుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇందులో ‘సుబ్రహ్మణ్య స్వామి’గా కనిపించనున్నాడని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ‘గాడ్ ఆఫ్ వార్’గా(God of war) కార్తకేయుడికి ఉన్న పేరుకు తగ్గట్టుగా సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఉంటుందని, పురాణాల స్పూర్తిగా త్రివిక్రమ్ ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.