పొరుగు దేశం పాకిస్థాన్(Pakistan) తీరు కుక్క తోక వంకరలా తయారైంది. భారత సైనికుల చేతిలో చావు దెబ్బ తింటున్నా కూడా.. తన బుద్ధిని పాకిస్థాన్ మార్చుకోవడం లేదు. తాజాగా.. సరిహద్దులో(Border) కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి పాక్ ఆర్మీ తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్లోని(Jammu Kahsmir) పూంఛ్ జిల్లా కృష్ణ ఘాటి సెక్టర్ పరిధిలో ఉన్న సరిహద్దుపై.. పాక్ ఆర్మీ(Pak Army) కాల్పులు చేసింది. తార్కుండి ప్రాంతంలో ఉన్న ఫార్వర్డ్ పోస్ట్ ను లక్ష్యంగా చేసుకుని తూటాల వర్షం కురిపించింది. తీవ్రంగా స్పందించిన భారత ఆర్మీ.. వెంటనే పాక్ ఆర్మీకి బుద్ధి చెప్పింది. శత్రు సైన్యంపై కాల్పులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో.. చాలా మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు విచిడిచినట్టు మన భద్రతా సిబ్బంది నుంచి సమాచారం అందుతోంది.
అయితే చొరబాట్లను ప్రోత్సహించడం.. లేదంటే కాల్పులతో సరిహద్దులో ఉద్రిక్తతలు పెంచడం. చాలా కాలంగా ఇదే తీరును ప్రవర్తిస్తున్న పాక్ ఆర్మీకి మన దేశ సైనికులైతే అడుగడుగునా బుద్ధి చెబుతూనే వస్తున్నారు. ఈ క్రమంలో.. మన సైనికులు కూడా కొందరు అమరులు అవుతూ.. దేశ రక్షణకు పాటు పడుతున్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో అర్థరాత్రి వేళ పాక్ వైపు నుంచి కొందరు అనుమానితులు.. మన దేశ భూ భాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిపై ఇండియన్ ఆర్మీ ఫైరింగ్ చేసింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. అందులో.. కొందరు పాకిస్తాన్ భద్రతా సిబ్బంది మారు వేశాల్లో ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. సహజంగానే.. పాక్ వాటిని ఎంత మాత్రం ధృవీకరించలేదు. ఆ మరుసటి రోజు.. అంటే ఈ నెల 8న.. రాజౌరీ సెక్టర్ లో కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు చేసిన ఈ పనితో.. మన సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి.









