హైదరాబాద్‌లోని ఐఏఎస్(IAS) అధికారుల ఇన్స్టిట్యూట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) గారు విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు(Gopala krishna naidu) గారి స్వీయచరిత్ర ‘లైఫ్ ఆఫ్ ఎ కర్మయోగి(Life Of Karmayogi) – మెమోయిర్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… అధికారులు కేవలం ఏసీ గదుల్లో కూర్చొని ఫైళ్లను సిద్ధం చేయడం కాకుండా, ప్రజల కోసం క్షేత్రస్థాయిలో పని చేయాలని స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాల క్రితం అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేసేవారని, కానీ ప్రస్తుతం కొందరు ఆ బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజా ప్రతినిధుల నిర్ణయాల్లో తప్పులు ఉంటే, అధికారులే వాటిని సరిదిద్దేలా చూడాలని సూచించారు. నిజమైన సేవా భావం కలిగిన అధికారులే గుర్తింపు పొందుతారని సీఎం అన్నారు. మంత్రుల విద్యార్హతలు, వారి శాఖల మధ్య సంబంధం లేకపోయినా, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు.
Watch Video For more details—>