అకీరా నందన్(Akira nandhan) వచ్చేస్తున్నాడు. పవన్ కల్యాణ్(Pawan kalyan) చేస్తున్న ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కాగానే.. జూనియర్ పవర్ స్టార్ తెరంగేట్రం చేయనున్నాడు. ప్రస్తుతానికి ఇది గాసిప్పే అయినా.. దాదాపుగా ఇది జరగడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాటిక్ ప్రెజెన్స్‌ను(Manly looks) సొంతం చేసుకుని.. మ్యాన్లీ లుక్ లో కనిపిస్తున్న అకీరా.. వచ్చే రెండు మూడేళ్లనాటికి మరింత దృఢంగా కనిపించేలా కసరత్తు జరుగుతోందట. ఆలోగా పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో అకీరాను జనాల్లోకి పంపాలనే ప్లానింగ్ కూడా మొదలైందట. రామ్ చరణ్ చేసిన చిరుతను మించే ప్రాజెక్టుతో.. అకీరాను టాలీవుడ్ లో లోడ్ చేస్తారని.. ఫ్యాన్స్ కు అది విజువల్ వండర్ ను మించిన అనుభూతిని కలిగించడం ఖాయమని అప్పుడే అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి.
కానీ.. ఇదంతా పాజిబుల్ కావడానికి చాలా తతంగం మిగిలే ఉంది. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి కావాలి. హరిహర వీరమల్లు పార్ట్ 1 అండ్ పార్ట్ 2.. ఉస్తాద్ భగత్ సింగ్.. ఓజీ.. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులు విడుదలకు సిద్ధం కావాలి. ఆలోగా.. మళ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పటి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదు. దాదాపుగా.. పవన్ పూర్తిగా పాలిటిక్స్ కే పరిమితం కావాల్సిన పరిస్థతి వస్తుంది. అందుకే.. వచ్చే రెండేళ్లలో కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి.. కావాలనుకుంటే మరో బ్లాస్టింగ్ సినిమా చేసి ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ ఆలోచించే అవకాశం ఉంది. ఆయన స్థానంలో వారసుడిగా.. అకీరాను రంగంలోకి దించే చాన్స్ కూడా ఉంది. ఈ ఆలోచనే.. ఇప్పుడు అకీరా ఎంట్రీకి బాటలు వేసి ఉంటుందన్న అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది.
Watch Video for Full Details –>