అభిమానులు గర్వించే స్థాయికి.. నేషనల్ క్రష్(National crush).. రష్మిక మందన్నా ఎదిగిపోతోంది. వరుసగా.. వందలు, వేల కోట్ల కలెక్షన్లు సాధిస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా ఉంటూ.. నిర్మాతలు, చిత్ర బృందానికి ఓ సెంటిమెంట్ అయిపోతోంది. రష్మిక హీరోయిన్ గా ఉంటే.. ఓ వెయ్యి కోట్లు అలా ఈజీగా నడిచి వచ్చేస్తాయన్నంతగా నమ్మకాన్ని కలిగించేసింది. రీసెంట్ గా విడుదలైన పుష్ప 2(Pushpa 2) సినిమా 1800 రూపాయల కోట్లు కొల్లగొట్టడం.. అలాగే విక్కీ కౌశల్(Vickey kaushal) తో చేసిన చావా సినిమా దేశం గర్వించేదగ్గ సినిమా కావడం.. కచ్చితంగా ఏడెనిమిది వందల కోట్లు కలెక్షన్ సాధిస్తుందని నమ్మకం కలగడం.. అంతకుముందు యానిమల్ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించేయడం.. ఇలా.. టచ్ చేస్తే వెయ్యి కోట్లు అన్నట్టుగా రష్మిక రేంజ్ ఎదుగుతూ పోతోంది. ఆకాశమే హద్దుగా.. ఆమె స్థాయి పెరుగుతూ.. ఫ్యాన్స్ సంబరపడేలా చేస్తోంది. నిజంగానే.. నేషనల్ క్రష్ గా రష్మిక మారిపోతోంది.
తాజాగా.. ఆమె బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్, సూపర్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్‌తో(Salman khan) సినిమా చేస్తోంది. సినిమా పేరు సికందర్(Sikandhar). బడ్జెట్ 400 కోట్ల రూపాయలు. దర్శకుడు మురుగదాస్. కానీ.. అంత బడ్జెట్ అంటే ఏదో ఓ మూల అనుమానం. పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయా రావా అని కంగారు. కానీ.. వారందరికీ ఆ అనుమానాలు పోయే సెంటిమెంట్.. రష్మిక రూపంలో కనిపిస్తోంది. వంద కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే.. పెట్టిన డబ్బులన్నా వస్తాయా అన్న అనుమానం నుంచి.. 400 కోట్ల బడ్జెట్ అయినా పర్వాలేదు.. రష్మిక ఉంది కదా.. ఏం కాదులే.. అనే స్థాయికి ఆమె ప్రభావం బాలీవుడ్ ను ఏలేస్తోంది. సికందర్ విషయంలో కూడా.. మేకర్స్ నుంచి ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోందట. కచ్చితంగా తమ సినిమా హిట్ అవుతుందన్న పూర్తిస్థాయి కాన్ఫిడెన్స్ తోనే అంతటి భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారట.
Watch Video for Full Details –>










