కేసీఆర్(KCR) పునరాగమనానికి టైమ్ వచ్చేసింది. ఏడాది క్రితం ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా నిస్తేజంలో కూరుకుపోయిన బీఆర్ఎస్ శ్రేణులు.. ఈ మధ్యే మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ సీన్ లోకి వస్తున్నారని తెలిసి ఉత్సాహంగా ఉన్నారు. రేవంత్ ప్రభుత్వానికి ఏడాది టైమ్ ఇవ్వాలని భావించిన కేసీఆర్.. ఇన్నాళ్లూ రాజకీయంగా ఎలాంటి పరిణామాలు తలెత్తినా స్పందించలేదు. చివరికి కేటీఆర్ కు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం ఇబ్బందులు కలిగించినా.. ఆయన అరెస్ట్ అవుతారని వార్తలు వచ్చినా.. కేసీఆర్ స్పందించలేదు. ఇన్నాళ్లకు ఆయన మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఫిబ్రవరి చివరిలో బహిరంగ సభ(Public meeting) అని ఇప్పటికే ప్రకటించి.. సంచలనాన్ని సృష్టించిన కేసీఆర్.. ఫిబ్రవరి 26న శివరాత్రి తర్వాత శివాలెత్తడం ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు. వచ్చీ రాగానే.. కాంగ్రెస్(Congress) ప్రభుత్వ వైఫల్యాల చిట్టా విప్పి జనాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
రేవంత్ రెడ్డి సరిగ్గా పరిపాలిస్తున్నారా.. బీఆర్ఎస్ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందా లేదా.. అన్నది ఇక్కడ పాయింట్ కాదు. కేసీఆర్ జనాల్లోకి రావడం మాత్రమే పాయింట్. ఆయన రాగానే.. ఏం చెబుతారు.. ఎలా మాట్లాడుతారు.. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై(Revanth reddy) ఎలాంటి వాగ్బాణాలు సంధిస్తారు అన్నదే అసలు పాయింట్. అదే జరిగితే.. రేవంత్ రెడ్డి ఊరుకోరు కదా.. ఆయన స్టైల్ లో ఆయన కేసీఆర్ పై విరుచుకుపడుతూనే ఉంటారు. అప్పుడు తెలంగాణ రాజకీయం… కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా కాకుండా.. కేసీఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్టుగా మారిపోతుంది. బీజేపీ నేతలు ఏమైనా విమర్శించినా.. అది ప్రభావితం చూపే అవకాశాలు దాదాపు తక్కువే. అందుకే.. కేసీఆర్ కట్టర్ ఫ్యాన్స్ తో పాటు.. బీఆర్ఎస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా కేసీఆర్ రాకకోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో నిర్వహించబోయే బహిరంగ సభలో ఆయన వీరంగాన్ని చూసి ఉత్సాహపడాలని ఆరాటపడుతున్నారు.
Watch Video for Full Details –>