ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champians trophy) ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్(Pakistan).. ఓవరాక్షన్ తో అతి తెలివి ప్రదర్శించింది. ఈవెంట్ ప్రారంభానికి ముందు.. కరాచీలోని గడాఫీ స్టేడియంలో.. జెండాలు ఎగురవేసే సంప్రదాయంలో.. కుక్క బుద్ధి చూపించింది. టోర్నమెంట్ లో పోటీ పడుతున్న దేశాల జెండాలు ఎగరేసిన పాక్.. ఒక్క భారత జెండాను(Indian flag) మాత్రం విస్మరించింది. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో.. పాక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ కావాలనే ఇలా కుట్ర చేస్తోందని దుమ్మెత్తిపోశారు. ఈ విమర్శల దాడితో ఉక్కిరిబిక్కిరైన పాక్.. చివరికి మెట్టు దిగాల్సి వచ్చింది. కరాచీ స్టేడియంలో భారత జెండాను ఏర్పాటు చేసింది. ఇలా.. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న ఇతర దేశాలతో పాటుగా.. భారత జెండా కూడా పాక్ గడ్డపై సగర్వంగా రెపరెపలాడింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాట్ ఏ మూమెంట్.. ఇండియన్ ఫ్లాగ్ ఇన్ పాకిస్తాన్.. అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. ఏడుగురు భారత విలేకరులకు పాక్ వీసాలు మంజూరు చేసిన విషయాన్ని కూడా తమ కామెంట్లలో హైలైట్ చేశారు.
ఈ టోర్నమెంట్ విషయంలో పాకిస్తాన్ ముందునుంచీ మొండి పట్టుదల ప్రదర్శించింది. ఎలాగైనా భారత క్రికెట్ జట్టును తమ దేశానికి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ.. ఇరు దేశాల మధ్య ఉన్న సున్నితమైన వ్యవహారాల కారణంగా.. భద్రతా పరమైన సమస్యల కారణంగా.. అటు కేంద్రంతో పాటు.. ఇటు బీసీసీఐ కూడా పాక్ కు మన జట్టును పంపేందుకు నో చెప్పాయి. తటస్థ వేదికపై అయితేనే ఆడతామని.. అవసరమైతే చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటామని కూడా ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేశాయి. మరో అవకాశం లేకపోవడంతో.. ఐసీసీ కూడా పీసీబీతో ఈ వ్యవహారంలో సుదీర్ఘంగా చర్చించింది.
Watch Video for More Details —>