గ్లోబల్ సిటీ హైదరాబాద్(Hyderabad).. మరో బిగ్గెస్ట్ ఈవెంట్ కు వేదిక కానుంది. బ్యూటిఫుల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. మే 4 నుంచి 31 వరకు.. ప్రపంచ సుందరి పోటీల(Miss world competition) నిర్వహణకు మన హైదరాబాద్ ఎంపికైంది. ప్రారంభ, ముగింపు వేడుకలు.. మన హైదరాబాద్ లోనే జరిపేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న వేడుకలకు ప్లాన్ చేశారు. 140 దేశాల నుంచి రానున్న అందమైన అమ్మాయిలు.. ఈ పోటీల్లో పాల్గొని టాలెంట్ చూపించబోతున్నారు. అందంతో పాటు.. తమ విజ్ఞానాన్ని కూడా ప్రదర్శించి.. టైటిల్ సొంతం చేసుకోనున్నారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్ పర్సన్, సీఈవో ఇయిన జీలియా మోర్లీ(Jilia Morley).. ఈ విషయాన్ని వెల్లడించారు.
గతంలో 1996.. 2024 సంవత్సరాల్లో మన దేశంలో ఈ పోటీలు జరిగాయి. గత ఏడాదైతే ముంబైలో జరిగిన పోటీలు.. అంతర్జాతీయంగా పేరు పొందాయి. ఈ సారి కూడా తీవ్ర పోటీ ఎదురైంది. దుబాయ్ నగరం.. ముందు వరుసలో నిలిచింది. కానీ.. మనకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకతను నిరూపించుకున్న హైదరాబాద్ నగరం.. వేడుకల నిర్వహణ అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే.. హైదరాబాద్ చారిత్రకంగా ప్రపంచ గుర్తింపు ఉన్న నగరం. పైగా.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అంతర్జాతీయ హోటళ్లు అనేకం ఉన్నాయి. ఐటీ రంగాన్ని శాసిస్తున్న వ్యవస్థ.. హైదరాబాద్ లో ఉంది. ఫార్మా హబ్ గా అంతర్జాతీయ గుర్తింపు ఉంది. మరెన్నో ప్రపంచ ప్రత్యేకతలను హైదరాబాద్ నగరం తన సిగలో ఇముడ్చుకుని ఉంది. ఇది గుర్తించిన నిర్వాహకులు.. దుబాయ్ ను కాదని మరీ.. మన నగరానికి పోటీల నిర్వహణ అవకాశాన్ని కల్పించారు.
Watch Video for More Details —>