భారతీయ జనతా పార్టీ(BJP) వైఖరి సుస్పష్టం. హిందువుల కోసం పని చేసే పార్టీ తమది అని బీజేపీ నేతలే ఓపెన్ గా చెప్పేస్తుంటారు. ఆ క్రమంలో కొన్ని కామెంట్లు చేస్తూ.. అనవసరంగా ఇరుక్కుపోతుంటారు. రంజాన్(Ramzaan) విషయంలో ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్లు కూడా ఇలాగే మిస్ ఫైర్ అయ్యాయి. అసలు విషయం ఏంటంటే.. వచ్చే రంజాన్ మాసానికి సంబంధించి రీసెంట్ గా రేవంత్(Revanth reddy) ప్రభుత్వం.. ముస్లిం ఉద్యోగులకు(Muslim employees) ఓ వెసులుబాటు ఇచ్చింది. ఓ గంట ముందే.. అంటే.. సాయంత్రం 4 గంటల వరకే విధులు పూర్తి చేసుకుని సిబ్బంది ఇంటికి వెళ్లిపోయే అవకాశాన్ని కల్పించింది. ఇదే.. బీజేపీ నేతలకు కోపం తెప్పించింది. ముస్లింలకు మాత్రమే వెసులుబాటు ఇస్తారా.. మీకు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్లు కనిపించరా.. భవనా, హనుమాన్ దీక్షలు తీసుకున్న వాళ్లు కనిపించరా.. దేవీ నవరాత్రుల సందర్భంలో అయినా ఇలాంటి సౌకర్యం హిందువులకు ఇవ్వరా.. అని ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా.. అసలు మీలో హిందూ రక్తం ప్రవహిస్తోందా లేదా.. అని భారీ భారీ డైలాగులు విసిరారు.
హిందువుల కోసం పని చేయడం.. వారి సంక్షేమం కోసం మాట్లాడ్డం తప్పుకాదు. ఆ విధానాన్ని కూడా ఎవరూ తప్పుబట్టరు. పార్టీ సిద్ధాంతం కాబట్టి.. వారి వరకు అది కరెక్టే కూడా. కానీ.. తమ బీజేపీ కూడా ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న వేరే రాష్ట్రాల్లో.. ఇలాంటి సౌకర్యం కల్పించారా లేదా అన్నది కూడా.. వారు చూసుకోవాలి కదా.. అని కొందరు విమర్శిస్తున్నారు. క్లియర్ గా చెప్పాలంటే.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో.. బీజేపీ భాగస్వామిగా ఉంది. కేంద్రం కూడా భారీగానే ఏపీకి నిధులు అందిస్తోంది. తెలంగాణ కంటే ఎక్కువగానే కేటాయిస్తోంది. కేంద్రానికి అంతటి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా.. ముస్లింలకు అక్కడి ప్రభుత్వం రంజాన్ ఫెసిలిటీ ఇచ్చింది. గంట ముందే ముస్లిం సిబ్బంది ఇంటికి వెళ్లిపోయే సౌకర్యాన్ని కల్పించింది. అక్కడ ఏ బీజేపీ నాయకుడు కూడా ఇంత తీవ్రంగా స్పందించలేదు. ఏ కార్యకర్త కూడా ఆ నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. అలాంటప్పుడు.. ఏపీలో తప్పుకానిది తెలంగాణలో ఎలా తప్పు అయ్యిందన్న వాదనను కొందరు లేవనెత్తుతున్నారు.
Watch Video for More Details —>