రాజకీయాలపై(Politics) కేసీఆర్(KCR) సీరియస్ గా ఉంటే.. ఎలా ఉంటుందో బీఆర్ఎస్(BRS) నేతలకు మళ్లీ తెలిసొచ్చింది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న ఆయన.. ప్రతి విషయంపై పూర్తి పట్టుతో వచ్చి.. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో విరుచుకుపడ్జారు. ప్రత్యర్థి పార్టీ నేతలనే కాకుండా.. సొంత కేడర్ తో కూడా చెడుగుడు ఆడుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత.. సొంతనేతలే ఇక బీఆర్ఎస్ పని ఖతమైందని చెప్పి.. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు కారణమయ్యారని సీరియస్ అయ్యారు. త్వరలోనే ఉప ఎన్నికలు వచ్చి తీరుతాయని.. కచ్చితంగా గెలిచి తీరేలా నేతలంతా పని చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్కు(Congress) చుక్కలు చూపిద్దామన్నారు. దీంతో.. ఆ రోజు తెలంగాణలో రాజకీయ భూకంపం ఖాయమని రాజకీయాలను పరిశీలిస్తున్న వాళ్లంతా కన్ఫమ్ అయిపోతున్నారు. మామూలుగా పార్టీ కార్యక్రమంలోనే కేసీఆర్ ఇంత సీరియస్ అవుతుంటే.. ఇక బహిరంగ సభలో ఆయన దూకుడును తట్టుకోవడం ఎవరివల్ల అవుతుందని అంటూ ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.
మరోవైపు.. పార్టీకి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుని.. కేడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను.. ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సమాజం అవసరాన్ని ఆధారంగా చేసుకుని తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డే బీఆర్ఎస్ అని కేసీఆర్ చెప్పారు. ఇది తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు. గత గాయాల నుంచి కోలుకుని మళ్లీ ఆత్మగౌరవ బావుటా ఎగరేయాలని నేతలకు స్పష్టం చేశారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మళ్లీ పటిష్టం చేసే పనిని ఈ భేటీ నుంచే మొదలుపెట్టిన కేసీఆర్.. కమిటీలు వేశారు. వాటికి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావును ఇన్ ఛార్జ్ గా నియమించారు. త్వరలోనే మహిళా కమిటీల ఏర్పాటు.. ఏప్రిల్ 10 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు.. అనుబంధ సంఘాల పటిష్టతకు సీనియర్ నేతలతో సబ్ కమిటీలు.. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధులతో సభ.. ఇలా అనేక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్.. వాటిని సమర్థంగా అమలు చేసే బాధ్యతను పార్టీ సీనియర్ నేతలపై పెట్టారు. ఏప్రిల్ 27 బహిరంగ సభ నాటికి ఈ నిర్ణయాలన్నీ అమలు చేసి.. పునాదులను పటిష్టం చేసుకుని.. జనాల్లోకి వెళ్లాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
Watch Video for More Details —>










