అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) కూతురు జాన్వీ కపూర్(Janhvi kapoor).. తెలుగులో బిజియెస్ట్ హీరోయిన్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో(NTR) ఎప్పుడు దేవరకు ఓకే చెప్పిందో కానీ.. ఆ మూవీ సక్సెస్ తర్వాత.. బ్లాక్ బస్టర్ అవకాశాలను అందుకుంటోంది. తెలుగులో మోస్ట్ వాంటెడ్ గా ఎదుగుతోంది. ప్రస్తుతం.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో (ram charan)బుచ్చిబాబు(Buchi babu) దర్శకత్వంలో.. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న జాన్వీ.. మరో సూపర్ డూపర్ అవకాశాన్ని దక్కించుకుందన్న వార్త.. టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. పుష్ప 2 తో ఇంటర్నేషనల్ గా వైల్డ్ ఫైర్ అనిపించుకున్న ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత సినిమాలో.. జాన్వీనే ఫిమేల్ లీడ్ అని వినిపిస్తోంది. తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో బన్నీ చేయనున్న సినిమా కోసం.. జాన్వీని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది జరిగితే.. జాన్వీ క్రేజ్ మామూలుగా పెరగదని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.
దేవర సినిమాతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకోవడంలో జాన్వీ సక్సెస్ అయ్యింది. తెలుగు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పి.. అందరి దృష్టిని ఆకర్షించింది. అలా చెప్పి.. ఇలా రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ దక్కించుకుంది.
Watch Video for More Details —>