రేఖా గుప్తా(Rekha guptha) 1974 జులై 19న హర్యానాలోని(Haryana) జుల్నాలో జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకే ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా ఢిల్లీకి వచ్చి స్థిరపడడంతో ఆమె విద్యాభ్యాసమంతా ఢిల్లీలో పూర్తి చేసింది . తరువాత 1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని దౌలత్ రామ్ కళాశాల నుండి తన డిగ్రీ పట్టాను అందుకుంది . పట్టభద్రురాలైన రేఖా గుప్తా మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం పరిధిలోని IMIRC కాలేజ్ ఆఫ్ లా భైనా నుండి 2022 లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసారు ..
రేఖా గుప్తా రాజకీయ జీవితం విషయానికి వస్తే…..రేఖా గుప్తా దౌలత్ రామ్ కాలేజీలో ఏబీవీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1996లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక అయింది.ఆ తరువాత భారతీయ జనతా పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాలలోకి వచ్చి 2003 నుండి 2004 వరకు బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసింది. అదే విభాగానికి 2004 నుంచి 2006 వరకు జాతీయ కార్యదర్శి తన సేవలు పార్టీకి అందించింది. పార్టీలో వివిధ హోదాల్లో తన ఉనికిని చాటుకుంది .
Watch Video for More Details —>