రాజస్థాన్లోని(Rajasthan) ఉదయపూర్లో(Udaipur) జరుగుతున్న ఆలిండియా స్టేట్ వాటర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా తెలంగాణ తన వాదనలు వినిపించింది , కృష్ణా జలాలను ఏపీ అడ్డదారిలో ఔట్ సైడ్ బేసిన్‌కు తరలించుకుపోతున్నదని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్(Water disputes) ట్రిబ్యునల్ 2 ముందు తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ వాదనలు వినిపించారు . కృష్ణాబేసిన్లోని ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే.. ఏపీ(AP) మాత్రం విచ్చలవిడిగా ఔట్ సైడ్ బేసినక్కు ఏటా 323 టీఎంసీలను తరలించుకుపోతున్నదని తెలిపింది. అవసరం ఉన్న వారికి నీటిని ఇవ్వాలి గానీ.. అవసరం తీరి దురాశతో ఎదురు చూసే వారికి కాదని పేర్కొంది. వర్షాకాలంలోనూ తెలంగాణ రైతులు నీళ్లు దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. ఏపీ మాత్రం యథేచ్ఛగా కృష్ణా పరివాహకంలోనే లేని ప్రాంతాలకు నీటిని తరలించుకెళ్లిపోతున్నదని ఆక్షేపించింది.
హెల్సింకి రూల్స్, బెర్లిన్ రూల్స్, ఐక్యారాజ్యసమితి వాటర్ కోర్స్ కన్వెన్షన్ ప్రకారం.. క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువున్న ప్రాంతాలు, ఇన్బేసిన్ ప్రాంతాలకే నీటి తరలింపులో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కృష్ణా జల వివాదాల పై బుధవారం ట్రిబ్యున ల్ చైర్మన్ జస్టిస్ బ్రజేశ్ కుమార్, జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ ఎస్. తాళపత్ర తో కూడిన బెంచ్ ముందు వాదనలు మొదలయ్యాయి. శుక్రవారం దాకా వాదనలు కొనసాగనున్నాయి. తెలంగాణ తరఫున అడ్వకేట్ సి.ఎస్. వైద్యనాథన్ వాదనలు వినిపించారు. సరఫరా కన్నా డిమాండ్ ఎక్కువున్నప్పుడు ఏపీ విచ్చలవిడి నీటి వినియోగానికి అడ్డుకట్ట వేయాలని ట్రిబ్యునల్ను కోరారు.
Watch Video for More Details —>