కూల్చివేతల విషయంలో హైడ్రా(Hydra) వైఖరిని రాష్ట్ర హైకోర్టు మరోసారి తప్పుబట్టింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి చెందిన వివరాలను పరిశీలించకుండానే షెడ్డును కూల్చేశారంటూ.. ఎ.ప్రవీణ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేసింది. కోర్టు(Court) ఆదేశాలతో.. హైడ్రా ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ కూడా హియరింగ్ కు హాజరయ్యారు. పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ నుంచి అలా ఫిర్యాదు వెళ్లగానే.. ఇలా కూల్చివేతలు చేపట్టారని.. తన క్లయింట్ సమర్పించిన ఆధారాలు పరిశీలించకుండానే షెడ్డును కూల్చేశారని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. ఈ నిర్మాణాలకు 2023లోనే పంచాయతీ నుంచి అనుమతులు వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
అనంతరం.. హైడ్రా తరఫు న్యాయవాది వాదిస్తూ.. గతంలో పంచాయతీ కార్యదర్శిని బెదిరించి ఈ అనుమతులను పిటిషనర్ సాధించారని.. ఆ తర్వాత అదే పంచాయతీ కార్యదర్శి ఆ ఉత్తర్వులను రద్దు చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని పత్రాలను పరిశీలించాకే.. నిర్మాణాన్ని కూల్చివేయడానికి హైడ్రా ముందుకు వెళ్లిందని స్పష్టం చేశారు.
Watch Video For More Details —->