Home National & International Team India Win : ఛాంపియన్లలా గెలిచిన భారత్

Team India Win : ఛాంపియన్లలా గెలిచిన భారత్

cricket
cricket

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని(ICC Chanpians Trophy) భారత క్రెకెట్ జట్టు ఘనంగా ప్రారంభించింది. దుబాయ్(Dubai) వేదికగా బంగ్లాదేశ్‎తో(Bangladesh) జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు.. మొదట్లో వడివడిగా వికెట్లు కోల్పోయింది. భారత పేసర్లు షమీ(Mohamad Shami), హర్షిత్ రాణా(Harshith rana) జోరుతో బంగ్లా టీమ్.. 35 పరుగులకే 5 వికెట్లు పారేసుకుంది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ తౌహిద్ హృదయ్ సెంచరీ చేయగా.. జకెర్ అలీ(Jaker ali) అర్థ సెంచరీ చేసి.. తమ జట్టు మంచి స్కోరు చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. 49.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 228 పరుగులు చేసి.. ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లతో మరోసారి సత్తా చాటగా.. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి.. బంగ్లా పతనాన్ని శాసించారు. మన బౌలర్ల జోరుతో.. ఆరుగురు బంగ్లా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పెవిలియన్ బాట పట్టారు.

Watch Video For More Details —->

https://youtu.be/UnZv5V2YYLg

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here