ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy).. మంచి మనసు చాటుకున్నారు. ప్రాణాపాయంలో ఉన్న ఓ విద్యార్థి(Student) గురించి తెలుసుకుని చలించిపోయారు. ఓ మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా.. వెంటనే స్పందించి.. ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. ఆ విద్యార్థి ప్రాణాలు కాపాడి.. అతడికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన గూళ్ల రాకేశ్(Gulla rakesh).. ఇంటర్మీడియట్ విద్యార్థి. అతను చాలా కాలంగా .. సూడో మస్క్యులర్ డిస్ట్రోఫి.. అనే వ్యాధితో బాధపడుతున్నాడు. కండరాల క్షీణించి ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటున్నాడు. రీసెంట్ గా.. కనీసం నడవలేని పరిస్థితికి అతని ఆరోగ్యం దిగజారింది.
చికిత్స చేయించేంత ఆర్థిక పరిస్థితి రాకేశ్ కుటుంబానికి లేదు. కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న రాకేశ్ కుటుంబీకులు.. కనీసం ఎవర్ని కలవాలి.. ఎలా చికిత్స ఇప్పించాలి.. ఎలా ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకోవాలి.. అందుకోసం ఎవర్ని సంప్రదించాలి అన్న సమాచారం కూడా తెలియక నరకయాతన అనుభవించారు.
Watch Video For More Details —->