యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విశ్వక్ సేన్(Vishwak sen).. క్షమాపణ(Apology) కోరాడు. రీసెంట్ గా విడుదలైన తన సినిమా లైలా(Laila) విషయంలో వచ్చిన విమర్శలపై స్పందిస్తూ ఓ బహిరంగ లేఖను(Letter) విడుదల చేశాడు. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమాపణలు చెప్పాడు. నేరుగా లైలా సినిమా పేరును టచ్ చేయకపోయినా కూడా.. తన చివరి సినిమాకు వచ్చిన విమర్శలను స్వీకరిస్తున్నానని.. ఇపై చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తానని విశ్వక్ సేన్ స్పష్టం చేశాడు. ఆ లేఖలో విశ్వక్ చేసిన కామెంట్లను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
నమస్తే. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా అభిమానులకు, నాపీ ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే. కానీ.. ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే. అసభ్యత ఉండదు.
Watch Video For More Details —->