సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram gopal Varma).. ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. అది సరదాగా మాట్లాడినా.. కోపంగా ఏదైనా చెప్పినా.. పాత విషయమైనా.. కొత్త విషయమైనా.. అది ఎలాంటిదైనా సరే.. హెడ్ లైన్స్ లో కూర్చోవాల్సిందే. తాజాగా.. అలాంటి సెన్సేషన్ నే మరోటి క్రియేట్ చేశారు.. ఆర్జీవీ. తనకు అమ్మాయిలంటే ఎంత పిచ్చి.. అన్న టాపిక్ ను మరోసారి చెప్పి.. మీడియా అటెన్షన్ ను గ్రాబ్ చేశారు. తను దర్శకుడు కాకముందు.. అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) అంటే పిచ్చిగా ఇష్టపడేవాడినని చెప్పిన వర్మ.. అన్నపూర్ణ స్టూడియో దగ్గర.. ఆమె ఇంటివద్ద.. వెంటపడేవాడట. చుట్టూ సెక్యురిటీ ఉండడంతో.. ఈ విషయం ఆమెకు అప్పుడు తెలియలేదట. చివరికి దర్శకుడయ్యాక.. క్షణక్షణం(Kshana kshanam) సినిమాను శ్రీదేవితో తీసి.. తన ప్రేమను(Love story) ఆమెకు తెలియజేశానంటూ.. రీసెంట్ గా చెప్పుకొచ్చారు.. ఆర్జీవీ. అంతకుముందు శ్రీదేవి వెంట ఎలా పడింది.. ఎంతగా ఆరాధించిదీ కూడా ఆమెకు తెలియజేసినట్టు గుర్తు చేసుకున్నారు.
Watch Video For More Details —->
https://youtu.be/5r2r9m-aTdI