అతి త్వరలో.. టెస్లా ప్లాంట్(Tesla plant) భారత్ లో ఏర్పాటు కాబోతోంది. స్వయంగా.. టెస్లా సీఈవో ఎలన్ మస్క్(Elon musk).. ఈ విషయాన్ని వెల్లడించారు. 40 వేల డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న హై ఎండ్ కార్లపై.. భారత ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించిన వెంటనే ఆయన ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 110 శాతంగా ఉన్న సుంకాన్ని కేంద్రం ఒకేసారిగా.. 70 శాతంగా మార్చేసింది. దీంతో.. భారత్ వైపు టెస్లా కన్ను పడింది. త్వరలోనే ఇతర దేశాల్లో ఉత్పత్తి అయిన టెస్లా కార్లు దిగుమతి చేసుకుని.. మెల్లగా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతానికి జర్మనీ నుంచి కార్లను దిగుమతి చేసుకుని.. సరైన సమయంలో భారతీయ ప్లాంట్ ను సిద్ధం చేయాలని టెస్లా సంస్థ ఆలోచిస్తున్నట్టుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ విషయం తెలుసుకున్నా చాలా రాష్ట్రాలు తమ ప్రాంతంలోనే టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కేంద్రంతో ఉన్న సానుకూల సంబంధాలను వాడుకుంటూ.. ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టినట్టుగా కూడా ఢిల్లీ మీడియాలో(Delhi media) వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దేశ పారిశ్రామిక రాజధాని అయిన ముంబై నగరాన్ని రాజధానిగా కలిగిన మహారాష్ట్ర.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్.. దక్షిణ భారతదేశం నుంచి తమిళనాడు.. ఎన్డీయే(NDA) ప్రభుత్వం కొలువై ఉన్న ఆంధ్రప్రదేశ్తో(Andhra Pradesh) పాటు.. పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో.. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాలకు కేరాఫ్ గా మారిన తెలంగాణ.. ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది
Watch Video For More Details —->