ఒకటి కాదు రెండు కాదు, అమెరికా దిగ్గజ ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లా(Tesla) కోసం దేశంలో పలు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ(Delhi), ముంబై(Mumbai) వంటి ప్రాంతాల్లో కొన్ని స్థలాలను పరిశీలించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అవి కేవలం టెస్లా అవుట్లెట్లు మాత్రమేనని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టతనిచ్చారు. మరోవైపు, భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు టెస్లా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యోగ నియామకాలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో, కంపెనీ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్ , మహారాష్ట్ వంటి రాష్ట్రాలు టెస్లాను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే, తాజాగా ఈ పోటీలోకి ఏపీ కూడా ఎంటర్ అవడం ఆసక్తికరంగా మారింది.
ఇక దీనికోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) స్వయంగా రంగంలోకి దిగి టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నారు. మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే టెస్లా ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం నుంచి కంపెనీకి ప్రత్యేక ఆఫర్లు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
https://youtu.be/UPlG8RrHwbc