తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy).. కొత్త చర్చకు తెర తీశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై(Kishan reddy) ఎవరూ ఊహించని కామెంట్లు చేశారు. అసలు హైదరాబాద్(Hyderabad) అభివృద్ధికి ఆయనే అడ్డంకిగా మారారంటూ ఆరోపణల వర్షం కురిపించారు. తాను హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే.. కేంద్ర మంత్రి స్థాయిలో అడ్డంకులు సృష్టిస్తున్నది కిషన్ రెడ్డే అంటూ బాంబ్ పేల్చారు. తాను కూడా గతంలో ఎంపీగా పని చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. కేంద్రంలో మంత్రులుగా ఉన్నవాళ్లు తనకు పరిచయస్తులు చాలా మందే ఉన్నారని చెప్పారు. అలాంటి కేంద్ర మంత్రులే.. కిషన్ రెడ్డి గురించి తనకు వివరించారన్నారు. పథాకాల కోసం, నిధుల కోసం తాను ప్రయత్నిస్తుంటే.. కిషన్ రెడ్డి వద్దని చెబుతున్నట్టుగా ఆ కేంద్ర మంత్రులు తనతో చెప్పారని అన్నారు.
“ఢిల్లీలో(Delhi) వాళ్లను కలిసినప్పుడలా చెబుతున్నరు. హైదరాబాద్ ను నువ్వు బాగానే అభివృద్ధి చేస్తున్నవ్. ప్రయత్నిస్తే హైదరాబాద్ విశ్వ నగరం అయితది.. మాకు చెయ్యాలనే ఉంది.. మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దామనుకుంటే.. మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు. మీరు అట్ల ఎట్ల ఇస్తరు కాంగ్రెస్ ప్రభుత్వానికి.. మీకు రేవంత్ రెడ్డి దోస్త్ అయితె అట్ల ఎట్ల ఇస్తరు.. మీ సంగతి చూస్కుంట.. అని కిషన్ రెడ్డి పంచాయితీ పెట్టుకుంటున్నడు.