తెలంగాణ(Telangana) ప్రజలకు శుభవార్త. కొత్త రేషన్ కార్డుల(Ration cards) కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న వారి కలలు.. ఇన్నాళ్లకు తీరబోతున్నాయి. ఇప్పటికే హామీ ఇచ్చిన మేరకు.. ముఖ్యమంత్రి రేవంత్(revanth) నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అది కూడా.. ఒకేరోజు ఏకంగా లక్ష మందికి కొత్తగా మంజూరు చేసిన కార్డులు అందించనుంది రేవంత్ ప్రభుత్వం. ఈ లెక్కన.. లక్ష కుటుంబాలు వచ్చే నెల నుంచి రేషన్ లబ్ధిని పొందనున్నాయి. ఫలితంగా.. 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు.. ప్రభుత్వం అందించే చౌక ధరల సరుకులను అందుకుని లాభపడనున్నారు. ఈ జాబితాలో ముందుగా.. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు కార్డులు అందుకోనున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అందుకే.. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల్లో.. అర్హులుగా గుర్తించిన వారికి కొత్త రేషన్ కార్డులను.. మార్చ్ 1న ప్రభుత్వం అందించబోతోంది. మిగిలిన జిల్లాల్లో.. ఎన్నికల కోడ్ తొలగిపోయాక.. మార్చి 8న కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు అధికార యంత్రాంగం ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే.. రేవంత్ ప్రభుత్వం.. గడచిన జనవరి 26న.. సుమారు 17 వేల మందికి కొత్త కార్డులు జారీ చేసింది.
https://youtu.be/1WyO1oo-yWM










