కుంభమేళాలో(Khumbhamela) మరోసారి కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రభుత్వం. ఈ మహా సంరంభం బుధవారంతో.. అంటే ఫిబ్రవరి 26తో ముగుస్తుండడం.. అదే రోజు మహా శివరాత్రి(Shivaratri) కావడంతో.. కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్‌కు(Prayagraj) తరలివచ్చే అవకాశం ఉందని యోగీ సర్కార్ అంచనా వేసింది. ఇన్ని రోజులుగా ఎదురైన అనుభవాలతో.. చివరి రోజు మరింతగా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచే.. కుంభమేళా ప్రాంతాన్నంతా నో వెహికిల్ జోన్ గా ప్రకటించింది. ప్రయాణికులకు సంబంధించిన ఎటువంటి వాహనాలను అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. ఈ వేడుకకు వస్తున్న భక్తులంతా.. ప్రభుత్వానికి, విధుల్లో ఉన్న సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ వేడుకలో భాగమయ్యే అశేష భక్త జనానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా.. పిల్లలు, పెద్దలు, మహిళలు ఇబ్బందులు పడకుండా.. అత్యవసర సేవలు అందించే వాహనాలతో పాటు.. నిత్యావసర సరుకులను అందించే వాహనాలను మాత్రం అనుమతించనున్నట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. ఎన్ని కోట్ల మంది వచ్చినా సరే.. అందరికీ మంచినీళ్లు, ఆహారం అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం చేసింది. భక్తులు.. తమకు సమీపంలో ఉన్న ఘాట్ లలోనే కుంభ మేళా స్నానం చేయాలని అధికారులు కోరుతున్నారు. ప్రయాగ్ రాజ్ అంతటా ఈ విషయాలను అనౌన్స్ చేయిస్తున్నారు. ఇప్పటికే వసంత పంచమి, మౌని అమావాస్య లాంటి పర్వదినాల సందర్భంగా.. కోట్లాది సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ వచ్చారు. పుణ్య స్నానాలు చేశారు. వారికి తగిన వసతులు కల్పించడంలో అధికారులు కూడా ఇబ్బంది పడ్డారు. కొన్ని గంటల పాటు ఎవరూ ప్రయాగ్ రాజ్ రావొద్దని కూడా అనౌన్స్ మెంట్లు చేశారు. ఈ వేడుక చివరి రోజు అలాంటి ఇబ్బంది ఎదురుకావొద్దనే.. ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.
https://youtu.be/zL1Xa72DJq4