దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli) సినిమాతో.. ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోయిన టాలీవుడ్ అందగాడు.. ప్రిన్స్ మహేశ్ బాబు(Mahesh babu) గురించి.. నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు అయిన మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్(Pawan kalyan) కు సాటి రాగల నటుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే.. అది మహేశ్ బాబు మాత్రమే అంటూ కామెంట్ చేశారు. పవన్ తర్వాత అంతటి ఫాలోయింగ్.. మహేశ్ కు మాత్రమే సొంతమని కితాబిచ్చేశారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు.. పవన్ కు పోటీ ఎవరని భావిస్తున్నారంటూ హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఇలా రియాక్ట్ అయ్యారు. తన భార్య కూడా మహేష్ కు సూపర్ ఫ్యాన్ అని.. ఆమె మహేశ్ ను తమ్ముడిగా భావిస్తూ ఉంటుందని చెప్పి మురిసిపోయారు.
ఇదే సందర్భంలో.. మహేశ్ గతం గురించి కూడా గుర్తు చేసుకున్నారు.. నాగబాబు. చిన్నప్పుడు మహేశ్ లావుగా ఉండేవాడని.. సినిమాలకు తగ్గట్టుగా సన్నగా అయ్యేందుకు ఎంతగానో కష్టపడ్డాడని.. పార్క్ లో నిత్యం జాగింగ్ చేస్తూ తనను తాను పూర్తిగా మార్చేసుకున్నాడని అన్నారు. ఏదైనా అనుకుంటే.. సాధించేవరకు నిద్రపోని గుణం మహేశ్ సొంతం అంటూ.. ప్రశంసల వర్షం కురిపించారు. అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదని.. మహేశ్ లోని ఆ కష్టపడే తత్వం తనకు బాగా నచ్చుతుందని నాగబాబు చెప్పారు. అలా.. పవన్ గురించి మాట్లాడుతూ.. మహేశ్ వరకు వచ్చి.. తన అభిమానాన్ని చాటుకున్న మెగా బ్రదర్.. ప్రిన్స్ ఫ్యాన్స్ ను ఆనందానికి గురిచేశాడు.










