దేశంలో రవాణా(Transport) రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. గంటకు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించేలా అత్యాధునిక టెక్నాలజీ పట్టాలెక్కబోతోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైపర్ లూప్ టెస్టు ట్రాక్ (Hyperloop Test Track)ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాసు దీన్ని అభివృద్ధి చేసింది.
దాదాపు 422 మీటర్ల టెస్టు ట్రాక్ ను భారత రైల్వే శాఖ సహకారంతో ఐఐటీ మద్రాసు(IIT Madras) రెడీ చేసింది. భారత్ హై-స్పీడ్ రవాణా విషయంలో నూతన శకంలోకి అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ఈ హైపర్ లూప్ టెస్టు ట్రాక్ను ఆవిష్కరించారు.
దీనివల్ల తక్కువ పీడనం కలిగిన ట్యూబ్లోప్రయాణికులు అత్యధిక వేగంతో ప్రయాణించవచ్చు. అంటే గంట సేపట్లోనే ప్రయాణికులు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని అధిగమించవచ్చు. ఈ సాంకేతిక వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే రాజస్తాన్ రాజధాని జైపూర్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి కేవలం అరగంటలో చేరుకోవచ్చు అంటే దీని వేగం ఎలాంటిదో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.










