మంచిర్యాల లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) బీజేపీ, బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం ఉందని, అందుకే ఫోన్ ట్యాపింగ్(Phone tapping) కేసులో కేసీఆర్, కేటీఆర్ అరెస్టు కాకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు(Sravan rao) అమెరికాకు పారిపోయారు. వారిని ఇండియాకు రప్పించాలని కేంద్ర హోంశాఖను కోరి పది నెలలైనా స్పందన లేదన్నారు. వాళ్లిద్దరూ రాష్ట్రానికి వస్తే కేసీఆర్, కేటీఆర్ చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని తెలిసే చీకటి ఒప్పందంలో భాగంగా అమెరికా లోనే దాచిపెడ్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఫామా హౌస్ లో కూసొని కేసీఆర్ తమ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని, ప్రజలు తిరస్కరించినా ఆయనలో మార్పురాలేదని విమర్శించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని నేనడుగుతున్నకేసీఆర్,కేటీఆర్ ను అరెస్టు చేయాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో పారిపోయి అమెరికాలో దాక్కున్న ప్రభాకర్ రావు, శ్రావణ్ రావును పట్టుకరావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పనికాదు. కేంద్ర హోంశాఖ చేయాలి. వాళ్ల కోసం రెడ్ కార్నర్ పంపించి 10 నెలలైంది. వాళ్లను ఎందుకు పట్టుకొస్తలేరు” అని నిలదీశారు.