ఐసీసీ(ICC) ఆధ్వర్యంలో జరుగుతున్న ఛాంపియన్స్ క్రికెట్ టోర్నమెంట్ 2025 నుంచి.. ఆతిథ్య పాకిస్తాన్(Pakistan) జట్టు అవమానకర రీతిలో నిష్క్రమించింది. న్యూజిలాండ్, భారత జట్లపై(Team india) ఘోర పరాజయాలు ఎదుర్కొన్న పాక్ టీమ్.. లీగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కనీస పోటీ ఇస్తుందనుకున్న పాక్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాకు తగినట్టుగా కాకుండా.. గల్లీ జట్టులా ఆడి తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. ఆటతీరుకు మించిన ఆటిట్యూడ్ ను చూపించి.. ఆఖరికి అంతర్జాతీయంగా అపఖ్యాతి మూటగట్టుకుంది. అంతకుమించి.. క్రికెట్ లో కొన్ని చెత్త రికార్డులు కూడా దక్కించుకుని ఫ్యాన్స్ తో పాటు.. మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.
29 ఏళ్ల తర్వాత.. పాకిస్థాన్ సొంతంగా ఐసీసీ టోర్నమెంట్ కు వేదికగా నిలిచింది. ఒక్క భారత జట్టు ఆడే మ్యాచ్ లు తప్ప.. మిగతావన్నీ పాక్ లోనే జరుగుతున్నాయి. భద్రతా కారణాల రీత్యా పాక్ కు వెళ్లేందుకు భారత జట్టు నో చెప్పడంతో.. దుబాయ్ లో ఇండియా మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్ విషయానికి వస్తే..హోస్టింగ్ టీమ్.. లీగ్ దశలోనే ఇలా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించడం గడచిన 16 ఏళ్లలో ఇదే మొదటిసారి. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి.. ఇలా లీగ్ దశలోనే పోటీ నుంచి తప్పుకున్న పాక్.. టోర్నమెంట్ హిస్టరీలో నాలుగో జట్టుగా నిలిచింది. ఈ రెండు అత్యద్భుతమైన చెత్త రికార్డులతో పాటు.. తమ ప్రవర్తనతో పాక్ జట్టు విమర్శలపాలైంది.