Home Telangana Telangana Students : తెలంగాణ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు

Telangana Students : తెలంగాణ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు

15 resservation
15 resservation

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాల ఆధారంగా.. విద్యాశాఖ పరిధిలో సంచలన నిర్ణయం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇకపై ప్రధాన కోర్సుల్లోని కన్వీనర్ కోట సీట్లు అన్ని తెలంగాణ విద్యార్థులకు వర్తించనున్నాయి.

కాస్త వివరంగా చెప్పాలంటే.. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం.. కన్వీనర్ కోటా పరిధిలోని 15 శాతం సీట్లు స్థానికేతరులకు కూడా వర్తించేవి. అంటే.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు కూడా తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మా, టెక్నికల్, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి అనేక కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి ఆ 15 శాతం అవకాశం ఉండేది.

https://youtu.be/qfi38F1PJuU

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here