రాజా సాబ్(Raja Saahb) విషయంలో అభిమానులకు ఇంకా ఓ క్లారిటీ అయితే ఇవ్వడం లేదు మేకర్స్. అసలు ఈ మూవీని ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ చాలానే బ్యాలెన్స్ ఉందట. మధ్యలో ప్రభాస్(Prabhas) డేట్లు దొరక్క గ్యాప్ రావడం, ఏదో ఒక సర్జరీ అంటూ ప్రభాస్ రెస్ట్ మోడ్లో ఉండటంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. వీటికి తగ్గట్టుగా మారుతి టీం కూడా చాలా స్లోగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇంకా పాటల చిత్రీకరణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.
సినిమాలో మొత్తం నాలుగు పాటలున్నాయని, వాటిని ఏ దేశాల్లో షూట్ చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని తెలుస్తోంది. మరి ప్రభాస్ రాజా సాబ్ మూవీ ఈ ఏడాది అయినా వస్తుందా? అన్నది వేచి చూడాలి.
https://youtu.be/08y5qAeHYNA