అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) వైట్‌హౌస్(White house) భేటీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ ఇరువురు నేతలు కూడా ఎక్కడ తగ్గేదే లేదంటూ..తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు..
ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య మొదట సజావుగానే భేటీ సాగింది. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చునని.. జెలెన్‌స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. ఆ సమయంలో ఇరు దేశాల రాయబారులు ఎదురుగానే వున్నారు. ట్రంప్ మాటలకు జెలెన్‌స్కీ ప్రతిస్పందనతో అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి బక్సానా గందరగోళానికి గురయ్యారు. తలపట్టుకున్నారు. ఆమె హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రష్యా చేస్తున్న యుద్ధానికి తెర తెంచడానికి శాంతి ఒప్పందం కుదర్చడం దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించేందుకు జెలెన్‌స్కీ శ్వేతసౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో చర్చలు అర్థంతరంగా ముగిశాయి.
మీడియా ఎదుటే ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకున్నారు. వీరి మధ్య చర్చలు రసాభాసగా మారాయి. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్‌స్కీ వైట్ హౌస్ వీడారు.