SLBC సొరంగం(SLBC Tunnel) పైకప్పు కూలిన ప్రమాద ఘటనలో చిక్కుకున్న 8 మంది జాడను గుర్తించడం.. రెస్క్యూ(Rescue Team) బృందాలకు సవాల్ గా మారింది. ఇంతలో.. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సహాయంతో చేసిన ప్రయత్నంలో.. శిథిలాల కింద కార్మికుల శరీరాలు ఉన్న ఆనవాళ్లు గుర్తించినట్టు వార్తలొచ్చాయి. దీనిపై.. అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోవడంతో.. బాధిత కుటుంబాల్లో అయోమయం కొనసాగింది. ఇంతలో.. నాగర్ కర్నూల్ ఆస్పత్రికి 8 అంబులెన్స్ లు చేరుకోవడం.. మరింత ఆందోళనకర పరిస్థితులకు కారణమైంది. అయితే.. అంబులెన్స్ లు అనేది ఏ అవసరానికైనా రావచ్చని.. ఆ 8 మంది కార్మికుల కోసమే అయితే కాదని కూడా మరికొందరు చెబుతున్నారు.
మరో వాదన ఏంటంటే.. రెస్క్యూ బృందాలు ఏ క్షణంలో అయినా.. ఎలాంటి సమాచారాన్నైనా చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. అందరూ ప్రార్థిస్తున్నట్టుగా.. ఆ కార్మికులు కొన ఊపిరితో ఉన్నా సరే.. తక్షణమే కాపాడేందుకు అనువుగా 8 అంబులెన్సులను ఏర్పాటు చేసి ఉంటారని తెలుస్తోంది. అనుకోని పరిస్థితుల్లో.. వారంతా ప్రాణాలు విడిచి ఉన్నా కూడా.. వారి స్వస్థలాలకు పార్థివ దేహాలను పంపించేందుకు ఆ అంబులెన్సులు ఉపయోగపడతాయన్నది.. అధికారుల ఉద్దేశంగా సమాచారం అందుతోంది.