గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan).. త్వరలోనే బాలీవుడ్ కు వెళ్లబోతున్నాడా.. స్టార్ మేకర్ కరణ్ జోహార్(Karan johar).. చరణ్‌ను బాలీవుడ్ లో(Bollywood) రీ ఇంట్రడ్యూస్ చేయనున్నారా.. ప్రముఖ దర్శకుడు నగేశ్ భట్‌తో(Nagesh bhatt) చరణ్ సినిమా కోసం చర్చలు కూడా జరుగుతున్నాయా.. ఈ ప్రశ్నలకు బీ టౌన్ వర్గాలైతే అవుననే సమాధానం ఇస్తున్నాయి. తన డ్యాన్సింగ్, యాక్టింగ్ టాలెంట్ తో.. సౌత్ టు నార్త్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న చరణ్ తో.. కరణ్ భారీ ప్రాజెక్టు చేయనున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే.. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
టాలీవుడ్ తో.. చాలా కాలంగా కరణ్ జోహార్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి, నాగార్జునతో ఆయన ఎంతో సన్నిహితంగా ఉంటారు. రీసెంట్ గా దర్శకుడు రాజమౌళితో, యంగ్ హీరో విజయ్ దేవరకొండతోనూ మంచి బాండింగ్ ఏర్పర్చుకున్నారు.










