Home National & International Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ రాక.. అందుకేనా?

Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ రాక.. అందుకేనా?

meenakshi
meenakshi

మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan). కాంగ్రెస్(Congress) అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీకి.. సన్నిహితురాలు. అలాంటి నాయకురాలిని.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా పంపించారు. ఇన్నాళ్లూ ఆ బాధ్యతల్లో ఉన్న సీనియర్ నాయకురాలు దీపాదాస్ మున్షీని తప్పించి మరీ.. మీనాక్షికి ఆ స్థానాన్ని కట్టబెట్టారు. ఇంత సడన్ గా ఎందుకు మీనాక్షిని తెలంగాణకు పంపించారు.. అన్నది పార్టీ వర్గాల్లోనే కాదు.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. దశాబ్దాల పాటుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లు.. అధిష్టానానికి వరుసబెట్టి ఫిర్యాదులు చేస్తుండడం.. సీఎం రేవంత్(Revanth reddy) వైఖరిపై వారంతా కోపంగా ఉండడం.. చివరికి మీనాక్షి చేతికి పార్టీ వ్యవహారాల బాధ్యతలు అందడం.. ఇవన్నీ ఒక్కోటిగా గమనిస్తుంటే.. ఏదో జరుగుతోందనే అనుమానం బలపడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here