ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో( Champions Trophy 2025) భారత జట్టు జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. లీగ్ దశలో న్యూజిలాండ్ తో జరిగిన చివరి మ్యాచ్ లో భారత్.. సూపర్ విక్టరీ దక్కించుకుని.. గ్రూప్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు.. మొదట్లో వడివడిగా వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ ఆటగాళ్ల అద్భత ఫీల్డింగ్.. ఇండియా బ్యాటింగ్(Batting) జోరును కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యింది. 30 పరుగులు చేసే లోపే రోహిత్, గిల్, కోహ్లీ వికెట్లు పడిపోయాయి. తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కలిసి ఒక్కో పరుగు జమ చేసుకుంటూ.. స్కోరు బోర్డును కదిలించారు. 25 ఓవర్ల దగ్గర వంద పరుగులు పూర్తి చేసిన భారత జట్టు.. ఆ తర్వాత 6 రన్ రేట్ ను కంటిన్యూ చేయడంలో సక్సెస్ అయ్యింది. శ్రేయస్ 79.. అక్షర్ పటేల్ 42.. కేఎల్ రాహుల్ 23.. హార్దిక్ పాండ్యా 45.. రవీంద్ర జడేజా 16.. ఇలా అందరూ తలో చేయి వేసి దూకుడుగా ఆడి జట్టు స్కోరును 249 పరుగులకు చేర్చారు.










