మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi) ఇంటర్నేషనల్ గా ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన కీర్తిని విశ్వ వ్యాప్తం చేశాయి. ఆయన ఏ దేశం వెళ్లినా సరే.. అక్కడున్న తెలుగు వాళ్లు.. వాళ్లను చూసి ఆ దేశంలోని స్థానికులు చిరును చుట్టుముట్టేసేంత ప్రభావాన్ని కలిగించాయి. అలాంటి మెగాస్టార్ చిరంజీవికి.. యూకే ప్రభుత్వం(UK) తమ దేశ పౌరసత్వాన్ని(Citizenship) ఇచ్చి గౌరవించిందన్న వార్త.. హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో అయితే.. ఈ వార్త ట్రెండింగ్ గా మారిపోయింది. ఈ న్యూస్ తెలిసి.. మెగాభిమానుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. దటీజ్ మెగాస్టార్.. అంటూ అంతా సంబరాలు కూడా చేసుకునేందుకు ప్లాన్ చేశారు.
ఇంతలో.. చిరంజీవి టీమ్ నుంచే అన్నట్టుగా ఓ అప్ డేట్ బయటికి వచ్చింది. యూకే ప్రభుత్వం నుంచి అలాంటి అవార్డు ఏదీ చిరంజీవికి అందలేదని.. అది ఊహాగానాలే తప్ప వాస్తవం కాదని.. ఏదైనా ఉంటే.. నేరుగా తామే విషయాన్ని ప్రకటిస్తామని చెప్పినట్టుగా.. మరో వార్త తెలుగు ప్రపంచాన్ని చుట్టేసింది.










