తెలంగాణ ప్రభుత్వం 2025లో అంగన్వాడీ ఉద్యోగాల(Telangana Anganwadi Recruitment) కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు(Anganwadi Teacher Jobs) మరియు హెల్పర్లకు సంబంధించి ఖాళీల భర్తీకి మంజూరీ లభించినట్టు సమాచారం. ఈ సంబంధిత ఫైల్‌పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ రోజు సంతకం చేసినట్లు తెలిసింది.
మొత్తం 14,236 పోస్టులను భర్తీ చేయనున్నారు, ఇందులో 6399 అంగన్వాడీ టీచర్లు మరియు 7837 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉంటాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఈ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.