
ఐపీఎల్ లో(IPL) ఆటతో తెలుగువాళ్లకు కుటుంబసభ్యుడిలా మారిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David warner).. ఇప్పుడు టాలీవుడ్(Tollywood) లోనూ ఎంటరవుతున్నాడు. నితిన్ తాజా ప్రాజెక్టు రాబిన్ హుడ్(Robinhood) లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భీష్మ తర్వాత వెంకీ కుడుముల(Venky kudumula) దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమా ఇది. ఎలాగైనా హిట్టు సాధించాలన్న కసితో తీర్చి దిద్దిన ఈ సినిమాపై.. క్రేజ్ తీసుకువచ్చే ప్రయత్నంలో.. డేవిడ్ వార్నర్ నూ కూడా ప్రాజెక్టులో భాగం చేసింది. క్యారెక్టర్ కూడా నచ్చడంతో.. ఆయన ఈ మూవీలో యాక్టింగ్ చేసి.. రాబిన్ హుడ్ పై అంచనాలు పెంచేశాడు. ఇప్పుడు అంతకు మించిన షాకింగ్ విషయాన్ని చిత్ర యూనిట్ బయటపెట్టింది.
ఈ నెల 28న రాబిన్ హుడ్ సినిమా విడుదల కానుంది. దీనికి సంబంధించి అతి త్వరలో ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి వేడుకలు ఉన్నాయి. ఈ ప్రమోషన్ ఈవెంట్లలో డేవిడ్ వార్నర్ కూడా హాజరవుతాడని దర్శకుడు వేణు కుడుముల చెప్పి.. సరికొత్త సంచలనానికి తెర తీశాడు. క్రికెట్ వ్యవహారాల నుంచి కాస్త తీరిక చేసుకుని మరీ.. నితిన్ కోసం డేవిడ్ వార్నర్ హైదరాబాద్ రానున్నాడని.. కచ్చితంగా రాబిన్ హుడ్ ప్రమోషన్స్ కు ఏదో ఒక వేదికపై మెరుస్తాడని చెప్పాడు. దీంతో.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేవిడ్ రాక ఖాయమని నితిన్ ఫ్యాన్స్ ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. అలా అయితేనే.. సినిమాకు హైప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
https://youtu.be/EBg-aDZ-OW0