రైలు హైజాక్ ఘటనతో.. పాకిస్థాన్ లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయన్నది.. ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆ దేశంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలు అన్న వాస్తవం.. ఇప్పుడు అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఏకంగా 182 మందిని తీవ్రవాదులు తమ బందీలుగా చేసి పాక్ ప్రభుత్వాన్ని బెదిరించిన తీరుతో.. ఆ దేశంలో ఎంతటి నిస్సహాయ పరిస్థితులు ఉంటాయన్నది కూడా తేటతెల్లమైంది. బెలూచిస్తాన్ పరిధిలోని పర్వత ప్రాంతం క్వెట్టా నుంచి.. పెషావర్ కు బయల్దేరిన జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఘటన.. ప్రపంచాన్నే కంగారు పడేలా చేసింది.
గత మంగళవారం ఉదయం పాకిస్తాన్ సమయం ప్రకారం ఉదంయ 9 గంటలకు క్వెట్టాలో రైలు బయల్దేరింది. సుమారు 400 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. సుమారు 17 సొరంగాల లోపలి నుంచి ఈ రైలు ప్రయాణించాల్సి ఉంది. 8వ సొరంగం దగ్గర కాపు కాసిన బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన తీవ్రవాదులు.. సరిగ్గా జాఫర్ ఎక్స్ ప్రెస్ వచ్చే సమయానికి రైల్వే ట్రాక్ పేల్చేశారు.
https://youtu.be/qW_P1-UX-Ws