Home National & International Donald Trump : పాక్‎కు అమెరికా దిమ్మ తిరిగే షాక్?

Donald Trump : పాక్‎కు అమెరికా దిమ్మ తిరిగే షాక్?

trump
trump

మరోసారి ప్రపంచానికి తన నిర్ణయంతో షాక్ ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald trump) సిద్ధమయ్యారు. 41 దేశాల పర్యాటకులను అమెరికాకు రానివ్వవద్దని ఆయన ప్లాన్ చేశారు. ఈ విషయంలో ఆయా దేశాలపై నిషేధం విధించేందుకు రెడీ అవుతున్నారు. ఆ దేశాలను మూడు గ్రూపులుగా విభజించి ఆంక్షలు అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తును పూర్తి చేసినట్టుగా సమాచారం అందుతోంది. అదే నిజమైతే.. అతి త్వరలో ఆ 41 దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించి.. ఆ దేశాల పర్యాటకులను(Tourism) అమెరికాకు రానివ్వకుండా అడ్డుకోవడం అనేది ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మొదటి గ్రూపులో అఫ్గాన్, సిరియా, క్యూబా, ఉత్తరకొరియా వంటి పది దేశాలు ఉన్నాయి. వీటిపై ట్రంప్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వీసా మంజూరు నిషేధాన్ని విధించనున్నట్టు తెలుస్తోంది. అలాగే రెండో గ్రూపులో ఎరిట్రియా, హైతి, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ వంటి దేశాలు ఉన్నాయి. వీటిపై పాక్షికంగా వీసా నిషేధం అమలు ఉంటుందని సమాచారం అందుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here