Home Entertainment L2E Empuran : అన్ని రకాల అంశాలతో అందరినీ అలరించేలా ఉంటుంది..

L2E Empuran : అన్ని రకాల అంశాలతో అందరినీ అలరించేలా ఉంటుంది..

L2E Empuraan, Mohanlal, Prithviraj Sukumaran, Malayalam cinema, Pan-India movie, March 27 release, Telugu cinema, Dil Raju, Aashirvad Cinemas, Sri Gokulam Movies, Murali Gopi
L2E Empuraan, Mohanlal, Prithviraj Sukumaran, Malayalam cinema, Pan-India movie, March 27 release, Telugu cinema, Dil Raju, Aashirvad Cinemas, Sri Gokulam Movies, Murali Gopi

మలయాళ సూపర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్(Prudhviraj sukumaran) కాంబోలో తెర‌కెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ముర‌ళీ గోపి క‌థ‌ను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా

సూపర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్ మాట్లాడుతూ .. ‘మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి థాంక్స్. 47 ఏళ్లుగా ఈ సినీ ఇండస్ట్రీలో నా ప్రయాణంలో తెలుగు చిత్ర సీమతో ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni nageshwar rao) గారితో నటించే అదృష్టం నాకు కలిగింది. తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ ఇంకెక్కడా దొరకదు. ఇండియాలోనే టాలీవుడ్ ది బెస్ట్ ఇండస్ట్రీగా ఉంది. కేరళలో మేం అన్ని భాషల చిత్రాలను చూస్తాం. ఇప్పుడు మా సినిమాల్ని కూడా అన్ని భాషల వాళ్లు చూస్తున్నారు. ఇప్పుడు మేం పాన్ ఇండియా వైడ్‌గా చిత్రాలను చేస్తున్నాం. సినీ లవర్స్ అందరి కోసం మేం మూవీస్ తీస్తున్నాం. పృథ్వీరాజ్ ఈ చిత్రంతో తెరపై అద్భుతం చేశారు. మేం ముందుగా లూసిఫర్‌ను మూడు పార్టులుగా తీయాలని అనుకున్నాం. ఎంపురాన్ బ్లాక్ బస్టర్ అయితే.. మూడో పార్ట్‌తో మళ్లీ వస్తాం. రెండేళ్లుగా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం. సుజిత్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. పాలిటిక్స్, యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని రకాల అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుంది. మార్చి 27న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన దిల్ రాజు(Dilraju) గారికి థాంక్స్. తెలుగులో మా సినిమాను రిలీజ్ చేస్తున్న ఆయనకు చాలా థాంక్స్. ఇలాంటి సినిమాను మేం ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒరిజినల్ వర్షెన్‌లానే తెలుగు వర్షెన్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డాం. చాలా అథాంటిక్‌గా ఉండాలని ప్రయత్నించాం. తెలుగు ప్రేక్షకులు తెలుగు వర్షెన్‌లో చూస్తే.. ఒరిజినల్ సినిమానే అనుకుంటారు. ఎక్కడా డబ్బింగ్ సినిమా అన్నట్టుగా కనిపించదు. లూసిఫర్ సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయలేదు. కానీ అన్ని భాషల్లోకి ఆ చిత్రం రీచ్ అయింది. అందుకే ఇప్పుడు ఈ రెండో పార్ట్‌ను ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే అన్నీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. . ఈ రేంజ్ ట్రెండ్ చూసి మేమంతా సర్ ప్రైజ్ అవుతున్నాం. నా దృష్టిలో మంచి సినిమా చెడ్డ సినిమా అనేది మాత్రమే ఉంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. నేను మంచి సినిమాను తీశానని నమ్ముతున్నాను. కాకపోతే ఆ సినిమాను హై బడ్జెట్‌లో తీశాను. ఈ మూవీని చూసిన తరువాత ఏ ఒక్కరూ కూడా ఎంత బడ్జెట్ అయి ఉంటందో అస్సలు అంచనా వేయలేరు. అలా ఎంత అంచనా వేసినా సరే దానికంటే ఎక్కువగానే ఉంటుంది. మోహన్‌లాల్ గారు ఇచ్చిన సపోర్ట్, ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ వల్లే ఈ మూవీని ఇంత గ్రాండియర్‌గా, ఇంత హై బడ్జెట్‌‌లో తీయగలిగాం. ఈ క్రెడిట్ అంతా ఆయనదే.ఈ మూవీ కోసం మోహన్‌లాల్ గారు, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశాం. మార్చి 27న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మూడో పార్ట్ చేసేలా సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ .. ‘లూసిఫర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మాలీవుడ్‌లో అత్యధిక బడ్జెట్‌తో తీసిన ఈ సీక్వెల్ ఏ రేంజ్‌లో ఉందో టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ట్రైలర్ అలా చూస్తూనే ఉండిపోయా. ఎంతో గ్రాండియర్‌గా అనిపించింది. స్క్రీన్ మీద మోహన్ లాల్ కనిపిస్తే వావ్ అనిపిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమార్ గారు పాన్ ఇండియా డైరెక్టర్ కాబోతోన్నారు. అన్ని భాషల్లో ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మాస్టర్ కార్తికేయమాట్లాడుతూ .. ‘ఎంపురాన్ నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. నన్ను నమ్మి నాకు ఈ చిత్రంలో ఇంత మంచి పాత్రను ఇచ్చిన పృథ్వీరాజ్ గారికి థాంక్స్. ఇంత పెద్ద చిత్రంలో నటించినందుకు ఎంతో గర్వంగా ఉంది. సలార్ తరువాత ఇంత పెద్ద ఆఫర్ వస్తుందని ఊహించలేదు. నీల్ సర్, పృథ్వీరాజ్ సర్ వంటి దర్శకులతో పని చేయడం ఆనందంగా ఉంది. మోహన్‌లాల్ సర్‌తో నటించడం ఆనందంగా ఉంది. మార్చి 27న ఎంపురాన్ రిలీజ్ అవుతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

కెమెరామెన్ సుజిత్ వాసుదేవ్ మాట్లాడుతూ .. ‘ఎంపురాన్ సినిమాకు పని చేయడం గర్వంగా ఉంది. మోహన్‌లాల్ సర్, పృథ్వీరాజ్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇది చాలా గొప్ప చిత్రం అవుతుంది. మార్చి 27న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here