
వాస్తవ నేర సంఘటనల ఆధారంగా రూపొందిన విభిన్న కథాంశంతో “కర్మణ్యే వాధికారస్తే”(Karmanye vadikaraste) చిత్రం రూపుదిద్దుకుంటోంది. కర్తవ్యాన్ని దైవంగా భావించే ఒక పోలీస్ అధికారుల బృందం నేర ప్రపంచంలో ఎదుర్కొన్న సవాళ్లను చూపించే ఈ చిత్రం, వారి ప్రయాణాన్ని వివరిస్తుంది.
అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, తన తొలి ప్రయత్నంలోనే తన ప్రత్యేకమైన దర్శకత్వ శైలితో ఆకట్టుకుంది. ఉషస్విని ఫిలిమ్స్ పతాకం కింద డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చూసుకున్నారు. భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ అందించగా, గ్యానీ సంగీతాన్ని సమకూర్చారు. కథ మరియు సంభాషణలు శివకుమార్ పెళ్లూరు అందించారు.
ప్రధాన పాత్రల్లో శత్రు, బ్రహ్మాజీ, మాస్టర్ మహేంద్ర నటిస్తుండగా, పృథ్వి, శివాజీ రాజా, శ్రీ సుధా, బెనర్జీ, అజయ్ రత్నం తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంతో ఐరా దయానంద్ రెడ్డి, అయేషా, రెహానా ఖాన్, కృష్ణ భట్ వంటి కొత్త ముఖాలు పరిచయమవుతారు.
విశాఖపట్నం, హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రం, ప్రస్తుతం ప్రసాద్ ఫిలిం ల్యాబ్ మరియు సారధి స్టూడియోస్ లో పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించి, ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఉన్న ఆసక్తిని పెంచింది.









