భారతీయ బ్లాక్ బస్టర్ గా నిలిచి.. unanimous hit talk అందుకున్న Pushpa 2 సినిమాకు.. అనుకోని ఓ చేదు అనుభవం ఎదురైంది. థియేటర్లలో, OTT లో.. ఆఖరికి overseas లో కూడా Thunderstorm లాంటి హిట్ అందుకున్న Pushpa 2 యూనిట్.. ఆ చేదు అనుభవంతో షాక్ లో ఉంది. TVలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని ఆశించిన బృందానికి నిరాశే ఎదురైంది. ప్రచారం ఘనంగా చేసినా కూడా.. ఫలితం మాత్రం పూర్తి నిరాశ కలిగించేలా రావడంతో.. Hero Bunny, director Sukumar.. నిరుత్సాహపడ్డారట. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించినా.. చేసేది లేదని తెలిసి డీలా పడిపోయారట.
అసలు విషయం ఏంటంటే.. రీసెంట్‌గా ఓ ప్రముఖ entertainment TV channel లో Pushpa 2 టెలికాస్ట్ అయ్యింది. IPL జరుగుతున్న టైమ్ లో ఎందుకింత రిస్క్ చేస్తున్నారు.. అని చాలా మంది ఓపెన్ గానే కామెంట్ చేసినా.. ఎవరు ఒత్తిడి చేశారో తెలియదు కానీ.. ఆ ఛానల్ లో సినిమా ప్రసారమైపోయింది. అంతకుముందు.. సుమారు వారం రోజుల పాటు ప్రచారం కూడా హోరెత్తిపోయింది. TV లో కూడా మూడు గంటల సినిమాను దాదాపు నాలుగు గంటలకుపైగా వేశారు. అంటే.. దాదాపు గంట పాటు ప్రకటనలు కూడా ప్రసారం చేశారు. ఈ ప్రీమియర్ షో ప్రసారానికి.. advertisers నుండి కూడా భారీగానే డబ్బులు వసూలు చేసి ఉంటారని trade వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
అంతా బాగానే ఉంది కానీ.. సినిమా ప్రసారమయ్యాక వచ్చిన ratings చూస్తే.. అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. గతంలో.. Bunnyనే హీరోగా నటించిన Ala Vaikunthapurramuloo సినిమా.. 29.4 TRP రేటింగ్ సాధించిందట. Pushpa 1 సినిమా విషయానికి వస్తే.. 22.54 రేటింగ్ నమోదైందట. అలాగే.. అదే Bunny హీరోగా వచ్చిన Duvvada Jagannadham సినిమాకు 21.7 రేటింగ్ వచ్చిందట. వీటన్నిటినీ Pushpa 2 తిరగరాస్తుందని.. Ala Vaikunthapurramuloo సినిమా రికార్డును బద్ధలు కొడుతుందని అంతా భావించారు. Pushpa 2 సినిమా సాధించిన ఘన విజయాన్ని గుర్తుకు తెచ్చుకుని.. ఆ మేరకు rating ఖాయమని విశ్వాసంగా ఉన్నారు. కట్ చేస్తే.. సీన్ దారుణంగా రివర్స్ అయ్యింది.
ఈనెల 12న TV లో ప్రసారమైన Pushpa 2.. కేవలం 12.61 రేటింగ్ మాత్రమే సాధించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది తెలిసి.. చిత్ర బృందం.. ముఖ్యంగా Hero Bunny, director Sukumar తీవ్ర నిరాశకు గురైనట్టుగా సమాచారం అందుతోంది. IPL ప్రభావానికి తోడు.. ఇప్పటికే ఈ సినిమాను theaters, OTT లో చాలా మంది చూసిన కారణంగా.. TVల్లో బీభత్సమైన ప్రకటనల మధ్య మరోసారి చూడలేక.. పట్టించుకోనట్టుగా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.