సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ (Danam Nagender).. అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) కు గట్టి షాక్ ఇచ్చారు. BRS అధినేత KCR గురించి దానం నాగేందర్ పాజిటివ్ గా మాట్లాడారు.
రేవంత్ రెడ్డి (Revanth) ప్రభుత్వానికి మింగుడుపడని రీతిలో ట్వీట్లు చేసిన సీనియర్ IAS ఆఫీసర్ స్మితా సభర్వాల్ (Smita Sabharwal) కు మద్దతుగా మాట్లాడారు. స్మిత (Smita) చేసిన ట్వీట్లను Congress నేతలంతా విమర్శిస్తుంటే.. దానం నాగేందర్ మాత్రం అందులో తప్పేంటని అంటున్నారు. ఉన్నదాన్నే కదా.. ఆమె చెప్పింది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. నారాయణగూడ కమ్యూనిటీ హాల్ లో.. జలమండలి, ఇతర విభాగాల ఉన్నతాధికారులు, పారిశుద్ధ్య సిబ్బందితో జరిగిన సమీక్షకు.. MLA గా దానం నాగేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆయ కాంచ్ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో Congress ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలపై స్పందించారు. పార్టీ గురించి తప్ప.. మిగతా అందరి గురించి మాట్లాడారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Shanti Kumari) పై సుప్రీం కోర్టు సీరియస్ అవ్వడం బాధ కలిగించిందని దానం నాగేందర్ చెప్పారు. మంచి ఆఫీసర్ గా పేరు ఉన్న ఆమెకు ఇలా చెడ్డపేరు రావడం ఆవేదనగా ఉందని అన్నారు. కాంచ్ గచ్చిబౌలి (Kanch Gachibowli) భూముల వివాదంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోందని చెప్పారు. అలాగే.. సీనియర్ IAS స్మితా సభర్వాల్ చేసిన రీ ట్వీట్ వివాదం.. పోలీసుల విచారణ తదనంతర పరిణామాలపైనా స్పందించి.. కాంగ్రెస్ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. స్మితా సభర్వాల్ చేసిన రీ ట్వీట్ లో తప్పేం లేదని, జరిగినదాన్నే తెలిపేలా ఆమె పోస్ట్ చేశారని దానం నాగేందర్ అన్నారు. ఈ హఠాత్ పరిణామాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా విశ్లేషిస్తున్నారు. స్మితా సభర్వాల్ కు దానం నాగేందర్ మద్దతు పలికారని.. ఉన్న విషయాన్నే స్మితా సభర్వాల్ చెప్పారని అనడం చూస్తుంటే.. ప్రభుత్వం నిజంగానే తప్పు చేసిందని దానం నాగేందర్ ఒప్పుకొన్నట్టే కదా అని అనలిస్టులు మాత్రమే కాదు.. సాధారణ జనాలు కూడా భావిస్తున్నారు.
అలాగే.. స్మితా సభర్వాల్ చేసింది తప్పే కాదని దానం నాగేందర్ అన్నారంటే.. విచారణకు పోలీసులు పిలవడం, కాంగ్రెస్ (Congress) నేతలు కూడా ఆమెను విమర్శించడం తప్పు అని చెప్పినట్టే కదా అంటూ అంతా చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లూ.. స్మితా సభర్వాల్ పోస్టులపై గొంతు చించుకున్నవాళ్లంతా ఇప్పుడు దానం నాగేందర్ కామెంట్లపై ఎలా స్పందిస్తారో అని వేచి చూస్తున్నారు. ఈ సందర్భంగా ఇంతకు మించిన మరో ట్విస్ట్ ఏంటంటే..వరంగల్లో BRS నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ గురించి.. దానం నాగేందర్ పాజిటివ్ గా మాట్లాడడం. ప్రజలంతా KCR ను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారని..వరంగల్ లో BRS సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందని దానం నాగేందర్ చెప్పడం.. కాంగ్రెస్ నేతలకు నిజంగానే షాకింగ్ గా అనిపిస్తోంది. కాంగ్రెస్ లో ఉంటూ.. ప్రతిపక్ష BRS పై అనుకూల కామెంట్లు ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలైతే.. మరో అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు దానం నాగేందర్ నిజంగానే పార్టీ మారారా కాంగ్రెస్ లోనే ఉన్నారా.. అంటూ చర్చించుకుంటున్నారట.