సాధారణంగా సినీరంగంలో ఒకరు చేయాల్సిన సినిమా మరో హీరోకు వెళ్లడం జరుగుతుంది. ఒక హీరో రిజెక్ట్ చేసిన మూవీతో మరో హీరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే ఒకరి ఖాతాలో పడాల్సిన డిజాస్టర్ మరొకరు చేస్తుంటారు. రామ్ చరణ్(Ram charan) హీరోగా పరిచయం కావాల్సిన గంగోత్రి మూవీ అనుహ్యంగా అల్లు అర్జున్(Allu arjun) వద్దకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా ఉన్న ప్రభాస్(Prabhas), జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) విషయంలోనూ అలాంటి ఘటనే జరిగింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయాల్సిన ఓ సినిమాను తారక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సత్తా చాటింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఇంతకీ డార్లింగ్ మిస్సైన ఆ బ్లాక్ బస్టర్ హిట్ ఏంటో తెలుసుకుందామా.. ?
జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో స్టూడెంట్ నెంబర్ 1(Student no-1) ఒకటి. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాసింది. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ముందుగా ప్రభాస్ హీరో అనుకున్నారట. కానీ కొన్ని కారణాలతో ఈ సినిమాను డార్లింగ్ చేయలేకపోయారు. దీంతో అదే కథ ఎన్టీఆర్ వద్దకు చేరింది. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.
2001లో విడుదలైన ఈ సినిమా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. ఇందులోని భారీ డైలాగ్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్ అన్ని సినిమాకు హైలెట్ అయ్యాయి. కెరీర్ తొలినాళ్లల్లోనే రాజమౌళి చెప్పిన సినిమాను రిజెక్ట్ చేసిన హీరోగా ప్రభాస్. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఛత్రపతి, బాహుబలి 1, 2 సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి.
Home Entertainment The Blockbuster Prabhas Missed : ప్రభాస్ మిస్ చేసిన బ్లాక్బస్టర్.. ఎన్టీఆర్ కెరీర్ మలుపుతిప్పిన...