సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) వరుస సినిమాలతో తన అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవలే ‘జైలర్’(Jailer) చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న తలైవా, ప్రస్తుతం ‘కూలీ’(Coolie) అనే చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్(Lokesh kanakaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో రజినీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయంపై ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ ఊపందుకుంది. అది ఏంటంటే – రజినీకాంత్‌కు భార్యగా నటించిన ఓ హీరోయిన్, యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యకు(Nagachaithanya) తెరపై కోడలిగా నటించింది అని మీకు తెలుసా?
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. శ్రియా శరణ్(Shreya sharan). ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా వెలిగిన ఈ ముద్దుగుమ్మ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరంజీవి, రజినీకాంత్, నాగార్జున(Nagarjuna), బాలకృష్ణ(Balakrishna), వెంకటేశ్(Venkatesh) వంటి సీనియర్ హీరోలతో పాటు, ప్రభాస్(Prabhas), ఎన్టీఆర్ వంటి నూతన తరం హీరోలతో జంటకట్టింది. అయితే వివాహం తర్వాత ఆమె సినిమా అవకాశాలు తగ్గించుకుంది. ప్రస్తుతం శ్రియా సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
శ్రియా నాగార్జున సరసన నటించిన ‘నేనున్నాను’(nenunnanu) సినిమాతో మంచి హిట్ అందుకుంది. అదే సమయంలో, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివాజీ’(Shivaji) చిత్రంలో రజినీ భార్యగా నటించింది. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. అనంతరం, కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత శ్రియా తిరిగి సినిమాల్లోకి వచ్చారు.
ఈ క్రమంలో, నాగార్జున–నాగచైతన్య(Nagachaithanya) కలిసి నటించిన ‘మనం’(Manam) సినిమాలోనూ శ్రియా నటించింది. ఈ సినిమాలో నాగార్జున భార్యగా కనిపించగా, నాగార్జున మాత్రం చైతన్య కుమారుడిగా నటించాడు. అంటే, సినిమాలో శ్రియా.. నాగచైతన్యకు కోడలవుతుంది అన్నమాట! ప్రస్తుతం శ్రియా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.