తెలంగాణకు చెందిన ఓ జవాన్ జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లా సరోజ్ ఔట్‌పోస్ట్‌లో విధుల్లో ఉన్న సమయంలో తాను వాడుతున్న సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సాయంత్రం 4.30 గంటల సమయంలో చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సెంట్రీ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు. అయితే ఈ కఠిన నిర్ణయానికి కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.