కంటి క్యాన్సర్ అరుదైనదే అయినా, ఎంతో ప్రమాదకరం. ముఖ్యంగా మెలనోమా అనే రూపంలో ఇది కంటిలోని ఐరిస్, సిలియరీ బాడీ, కొరోయిడ్ వంటి భాగాల్లో అభివృద్ధి చెందుతుంది. అస్పష్టమైన దృష్టి, కంటి మచ్చలు, చికాకు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఇది శరీరానికి వ్యాపించే అవకాశం ఉండడంతో తొందరగా గుర్తించి చికిత్స చేయడం అవసరం. ధూళి, కాలుష్యం, కఠిన సూర్యకాంతి నుంచి కళ్లను రక్షించుకోవడం కీలకం. కుటుంబంలో ఎవరికైనా కంటి క్యాన్సర్ ఉన్నా, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. మనదేశంలో ఇది 1% కన్నా తక్కువగా ఉన్నా, అవగాహన మాత్రం తప్పనిసరి.